ప్రముఖ సంస్థ ఐఎండీబీ ఈ వారం టాప్ 10 నటీనటుల జాబితాను రిలీజ్ చేసింది. ఈసారి ఈ లిస్ట్‌లో స్టార్ హీరోల పేర్లు కనిపించకపోవడం గమనార్హం. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను వెనక్కి నెట్టి కొత్త తరం నటుడు మొదటి స్థానంలో నిలవడం విశేషం. అలాగే వీరితో పాటు ఈ లిస్ట్‌లో ఐశ్వర్యరాయ్, భూమి పెడ్నేకర్ వంటి హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నాయి. మరి ఈ వారం మోస్ట్ పాపులర్ నటీనటులో ఐదుగురు గురించి తెలుసుకుందాం.
ఇషాన్ ఖట్టర్
బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖట్టర్ ఈ మధ్య వార్తల్లో నిలిచాడు. అతడు నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘ది రాయల్స్’ కారణంగా బాగా పాపులర్ అయ్యాడు. దీంతో ఐఎండీబీ టాప్ 10 నటుల జాబితాలో ఇషాన్ అగ్ర స్థానంలో ఉన్నాడు.
షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఈ జాబితాలో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఐఎండిబి టాప్ 10 నటుల జాబితాలో అతడు ఫస్ట్ ప్లేస్ నుంచి కిందికి పడిపోయాడు. ఈసారి పాపులారిటీ పరంగా ఇషాన్ కంటే వెనకబడ్డాడు.
ఐశ్వర్య రాయ్ బచ్చన్ – ఐశ్వర్యారాయ్ బచ్చన్ సినిమాలకు దూరంగా ఉన్నా.. ఆమె క్రేజ్ ఏ మాత్రమూ తగ్గలేదు. ఈ వారం పాపులారిటీ పరంగా ఆమె మూడో స్థానంలో నిలిచారు. విశేషం ఏంటంటే ఐశ్వర్యరాయ్ ఈ వారం సల్మాన్ ఖాన్ ను దాటేశారు.
సల్మాన్ ఖాన్ – ఐఎండీబీ రిలీజ్ చేసిన ఈ లిస్ట్‌లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నాలుగో స్థానానికి పడిపోయాడు. పాపులారిటీ పరంగా అతడు వెనకబడ్డాడు. సికందర్ సినిమా తర్వాత ఆయన పాపులారిటీ మరింత దెబ్బతింది.
వామికా గబ్బి – ‘భూల్ చుక్ మాఫ్’ చిత్రంతో వామికా గబ్బి వార్తల్లో నిలిచింది. ఆమె అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన పేరు సంపాదించుకుంది. ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఆమె ఐదో స్థానంలో కొనసాగుతోంది.