Independence Day Offer: ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ప్రేక్షకులకు జియో హాట్ స్టార్ బంపర్ ఆఫర్

Jio Hotstar Independence Day Offer: ఓటీటీలు వచ్చాకా.. ఎంటర్ టైన్మెంట్ కి కొదవే లేదు. అన్ని సినిమాలను, టీవీ షోలను, వెబ్ సీరీస్ లను హాయిగా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. అయితే రేపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 15న జియో హాట్ స్టార్ లోని అంత కంటెంట్ (సినిమాలు, వెబ్ సీరీస్ లు, టీవీ షోలు) ను సబ్ స్కిప్షన్ లేకుండానే ఫ్రీగా వీక్షించే అవకాశం కల్పించింది. ‘ఆపరేషన్ తిరంగా’ అనే పేరుతో ఈ ఆఫర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇండిపెండెన్స్ ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

అందరికీ ఫ్రీ

ఈ ఆఫర్ జియో యూజర్లకు మాత్రమే కాదు, ఎయిర్‌టెల్, విఐ వంటి ఇతర నెట్‌వర్క్ యూజర్లు కూడా పొందవచ్చు. ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. మొబైల్ లేదా టీవీ యాప్ లో జస్ట్ లాగిన్ అయితే సరిపోతుంది. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో ‘సలాకార్’, ‘సర్జమీన్’, 3BHK వంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఆగస్టు 15 తర్వాత ఒకవేళ మీకు జియో హాట్‌స్టార్ కంటెంట్ నచ్చితే, ఆ తర్వాత మీరు తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్‌లను కొనుగోలు చేసి సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం