ఇండియన్ సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న “థగ్ లైఫ్” ఒకటి. కోలీవుడ్ లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో స్టార్ క్యాస్టింగ్ నటిస్తోంది. ఫుల్ గ్యాంగ్ స్టార్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 5న రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఒక్కో ఈవెంట్ ను ఒక్కో ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. మే 17 అంటే రేపు ఈ చిత్రం ట్రైలర్ను ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత మే 24వ తేదీన హైదరాబాదులో గ్రాండ్గా ఆడియో లాంచ్ ఈవెంట్ ను జరపనున్నారు.
ఆ తర్వాత మే 29న వైజాగ్లో తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ లెవెల్ లో ఏర్పాటు చేయనున్నారు. వీటికంటే ముందు చెన్నైలోని సాయిరాం కాలేజీలో మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. అక్కడే ఆడియో లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట మూవీస్ భరే స్థాయిలో విడుదల చేస్తుంది.
టాలీవుడ్ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ థగ్ లైఫ్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. గతంలో విక్రమ్, అమరన్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన ఈ సంస్థ ఇప్పుడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుంది. ఇందులో శింబు, జయం రవి, పంకజ్ త్రిపాటి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, సానియా మల్హోత్రా, జోజు జార్జ్ వంటి నటీనట్లు కీలక పాత్రలో పోషిస్తున్నారు.