మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఇందులోని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మంచు విష్ణు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు సహా మరెందరో స్టార్ యాక్టర్స్ తమ పాత్రల్లో కనిపించి అలరించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈ క్రమంలో మేకర్స్ మరో సర్ప్రైజ్ అందించారు. కన్నప్ప సినిమా షూటింగ్‌కి సంబంధించి ప్రభాస్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ప్రభాస్ శివ భక్తుడి పాత్రలో అడవిలో నుంచి ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న స్టిల్ ఓ రేంజ్‌లో ఉంది. డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను పిచ్చెక్కించాడు. అలాగే సినిమా సెట్‌లో మంచు విష్ణు, మోహన్ బాబు కలిసి మాట్లాడుకుంటున్న సన్నివేశాలు కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Making video 🔥🔥#Prabhas #Kannappa
— Pradeep 🦅 (@Pradeepreddy___) June 14, 2025
ఇదిలా ఉంటే మంచు విష్ణు తన కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రంతో వస్తున్నాడు. దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేసి కన్నప్ప మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, సాంగులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఇందులో స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటించడంతో మరింత బజ్ ఏర్పడింది. ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ అండ్ సీనియర్ హీరోలు నటించడంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.






