kannappa telugu trailer: ‘కన్నప్ప’ ట్రైలర్ సూపరెహే.. ప్రభాస్ ఊరమాస్ యాక్టింగ్

మంచు విష్ణు తన కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రంతో వస్తున్నాడు. దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేసి కన్నప్ప మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, సాంగులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఇందులో స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటించడంతో మరింత బజ్ ఏర్పడింది. ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ అండ్ సీనియర్ హీరోలు నటించడంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఇందులోని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మంచు విష్ణు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు సహా మరెందరో స్టార్ యాక్టర్స్ తమ పాత్రల్లో కనిపించి అలరించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ చూసి ఎెంజాయ్ చేయండి.

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ గతంలో తెలిపారు. కానీ అని వార్య కారణాలవల్ల వాయిదా పడింది. అందిన సమాచారం ప్రకారం.. వి ఎఫ్ ఎక్స్ కారణాలవల్లే ఈ మూవీ వాయిదా పడిందని తెలిసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ గతంలో మంచు విష్ణు ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

ఏప్రిల్ 25న రిలీజ్ కావలసిన కన్నప్ప సినిమా వాయిదా పడిందని తెలిపారు. కానీ అప్పుడు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. తాజాగా దీనిపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని జూన్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం