Actor S Srinivasan: రూ.5 కోట్ల భారీ మోసం.. కోలీవుడ్ ‘పవర్‌స్టార్’ను అరెస్టు చేసిన పోలీసులు

ఎస్. శ్రీనివాసన్ తమిళనాడుకు చెందిన ఒక నటుడు. నిర్మాత, వివాదాస్పద వ్యక్తిగా పేరుపొందారు. 2011లో వచ్చిన “లత్తీకా” అనే తమిళ చిత్రంతో ఆయన వెలుగులోకి వచ్చారు. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా, స్వయంగా నిర్మించి, సంగీతం కూడా అందించారు. తన చిత్రాలకు ముందు, వెనుక “పవర్ స్టార్” అనే బిరుదును తగిలించుకొని ఆ పేరుతోనే ప్రాచుర్యం పొందారు. ఆయన విచిత్రమైన ప్రవర్తన, స్వీయ-పొగడ్తలు, ఆర్భాటమైన ప్రకటనలతో సోషల్ మీడియాలో తరచుగా ట్రోల్ అవుతుంటారు.

తాజాగా నటుడు ఎస్. శ్రీనివాసన్ చిక్కుల్లో పడ్డారు. బుధవారం ఢిల్లీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. రూ. 1000 కోట్ల భారీ రుణం ఇప్పిస్తానని ఒక సంస్థను నమ్మించి.. వారి నుండి రూ. 5 కోట్లు వసూలు చేసిన కేసులో ఈ అరెస్ట్ జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ వ్యాపార సంస్థకు రూ. 1000 కోట్ల రుణం ఇప్పిస్తానని శ్రీనివాసన్ హామీ ఇచ్చారు. ఈ లావాదేవీలో భాగంగా, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఖర్చుల పేరుతో సదరు సంస్థ నుంచి రూ. 5 కోట్లు తీసుకున్నారు. అయితే, హామీ ఇచ్చిన విధంగా రుణం ఇప్పించడంలో శ్రీనివాసన్ విఫలమయ్యారని, అంతేకాకుండా తీసుకున్న డబ్బును కూడా తిరిగి చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో మోసపోయిన బాధితులు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా, ఎస్. శ్రీనివాసన్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలికితీయడానికి, అలాగే ఇందులో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఎస్. శ్రీనివాసన్‌పై గతంలో కూడా ఇలాంటి ఆర్థిక మోసాలు, వివాదాల ఆరోపణలు ఉన్నాయి. ఇది ఆయన కెరీర్‌లో మరో వివాదాస్పద సంఘటనగా మారింది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం