Good Bad Ugly: ఓటీటీలోకి అజిత్ రూ.200 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా అదరగొడుతున్నాడు. అతడు గతంలో నటించిన విడాముయార్చి సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పేవలమైన రెస్పాన్స్ అందుకుంది.

దీని తర్వాత అజిత్ మరొక కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఆదిక్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా చేశాడు. ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మాణంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో అజిత్ పవర్ ఫుల్ పాత్రలో నటించి అదరగొట్టేసాడు. తమ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలాంటి లుక్కులో దర్శనమిచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఇక ఈ చిత్రం టాక్ కు తగ్గట్టుగానే కలెక్షన్స్ రాబట్టింది. రిలీజ్ అయిన పది రోజుల్లోనే దాదాపు 200 కోట్ల రూపాయల మార్కును రాబట్టింది.

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని మే 8 వ తేదీన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో బంపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

తరవాత కథనం