కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇటీవల ఓ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తమిళ్ లో డ్రాగన్ అనే పేరుతో విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో విడుదల చేశారు. తెలుగులో కూడా విశేష స్పందన అందుకుంది.
కామెడీ, లవ్, ఎమోషన్ తో కూడిన ఈ చిత్రం సినీ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అదరగొట్టేసింది. ఇప్పుడు ఈ హీరో మరోసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా తన లైన్అప్ లో ఉన్న కొత్త సినిమాను ప్రారంభించాడు.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. తమిళ్లో ఈ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. ఈ సినిమా రెండు భాషల్లోనూ రిలీజ్ కానుంది. డెబ్యూ డైరెక్టర్ కీర్తిశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఇందులో ప్రేమలు మూవీ బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ కుమార్, ద్రవిడ్ సెల్వం, తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యాంకర్ ఈ సినిమాకు సంగతి అందిస్తున్నాడు.
ఇవాళ పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ తో పాటు హీరో ప్రదీప్ రంగనాథన్, కోలీవుడ్ నటుడు శరత్ కుమార్, హీరోయిన్ మమిత బైజు, డైరెక్టర్ కీర్తి స్వరన్ సహా మరికొందరు ఇందులో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.






