MAD Square Movie: బ్లాక్ బస్టర్ మూవీ ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రేక్షకులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ప్రకటనతోనే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మధ్య విడుదలైన టీజర్ ఎంతగానో సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, అంచనాలను మరింత రెట్టింపు చేసింది. మ్యాడ్ స్కేర్ బాక్సీఫీస్ వద్ద సూపర్ హిట్ కాబోతుందని సినీ అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఒకరోజు ముందుగానే థియోటర్లలోకి
‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ మార్చి 29 శనివారం రోజు రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు ఒక రోజు ముందు అంటే మార్చి 28 రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ నిర్ణయంతో మ్యూడ్ స్క్వేర్ మూవీ ఫస్ట్ వీక్‌లోనే భారీ వసూళ్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రీలిజ్ డేట్ మార్చడంపై నిర్మాత కామెంట్స్
‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాన్ని ఒకరోజు ముందు రిలీజ్ చేయడంపై ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ దీనిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మా డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్ధన మేరకే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాము. అయితే చివరి నిమిషంలో విడుదల తేదీ మార్చాలనే ఉద్యేశం మాకు ఎప్పుడూ లేదు. పైగా మార్చి 29న అమావాస్య కావడంతో ఒకరోజు ముందుగానే విడుదల చేస్తే బాగుంటుందని మా డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడ్డారు.
ఈ నిర్ణయం పట్ల తాము కూడా చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు. ఇక పోతే మార్చి 28న మ్యాడ్ స్క్వేర్ మూవీతో పాటు, రాబిన్ హుడ్ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్‌ను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు. ఈ సమ్మర్‌కి నవ్వులు పండుగ రాబోతుంది అంటూ ప్రొడ్యూసర్ నాగవంశీ తెలిపారు.
మ్యాడ్ స్క్వేర్ సినిమా విశేషాలు..
ఇక ఫస్టాఫ్‌లో తమ అల్లరితో నవ్వులు పూయించడానికి నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ (లడ్డు).. ‘మ్యాడ్ స్క్వేర్’లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. రెబా జాన్ ప్రత్యేక పాటలో సందడి చేయనున్నారు. కె.వి. అనుదీప్, ప్రియాంక జవాల్కర్ తదితరులు కీలక పాత్రలలో అలరించనున్నారు.
‘మ్యాడ్ స్క్వేర్’ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు విశేష ఆదరణ పొందాయి. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ బ్యానర్లపై ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ, నిర్మాతలు హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.






