Mirai: యంగ్ హీరో తేజ సజ్జా ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో తన రాబోయే చిత్రం ‘మిరాయ్’ కూడా దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ , చైనీస్ మొత్తం 5 పైగా భాషల్లో విడుదల చేస్తున్నారు.
‘ధర్మ ప్రొడక్షన్స్’
అయితే తాజా అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా హిందీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’ సొంతం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే తేజ సజ్జా గత సినిమా హనుమాన్ నార్త్ లో మంచి విజయం సాధించింది. అంతేకాదు తేజకు కూడా అక్కడ మంచి పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో ధర్మ ప్రొడక్షన్స్ ‘మిరాయి’ చిత్రాన్ని హిందీ మార్కెట్‌లో విడుదల చేసే బాధ్యతను తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘మిరాయి’ సినిమాకు హిందీలో భారీ రిలీజ్ లభించనుంది. తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను విడుదల చేస్తోంది.
యాక్షన్ అడ్వెంచర్, మైథలాజికల్ కథాంశంతో మిరాయ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు . ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్లు విడుదలవగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో తేజ ఒక సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు దాచిపెట్టిన తొమ్మిది రహస్య గ్రంథాలను రక్షించే ‘సూపర్ యోధుడి ‘ కథగా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ తో అర్థమైంది.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నారు. శ్రియా సరన్, జగపతి బాబు, రితికా నాయక్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మిరాయి’ సెప్టెంబర్ 5, ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో, ఈ సినిమా హిందీ ప్రేక్షకులోకి భారీ ఎత్తున వెళ్లనుంది.






