Vrusshabha: పవర్‌ఫుల్ సినిమాతో మోహన్‌లాల్ ‘వృషభ’ పోస్టర్ రిలీజ్

మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తన రాబోయే యాక్షన్ డ్రామా చిత్రం ‘వృషభ’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సౌత్ సూపర్ స్టార్ తన 65వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మోషన్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ మేరకు తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆసక్తికర పోస్టు చేశాడు.

వీడియో పోస్టర్‌లో మోహన్‌లాల్ డ్రాగన్-స్కేల్ డిజైన్‌లతో బంగారు-గోధుమ కలర్ కవచం ధరించి యోధుడిగా కనిపిస్తున్నాడు. కత్తి పట్టుకుని ప్రశాంతంగా ఉన్నాడు. పొడవాటి జుట్టు, గుబురు గుబురు గడ్డంతో కనిపించడంతో పోస్టర్ పై క్యూరియాసిటీ పెరిగింది. దీనితో పాటు తుడారుమ్ నటుడు ఈ చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించాడు. ఈ చిత్రం అక్టోబర్ 16, 2025న విడుదల కానుందని తెలిపాడు.

ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఉమా శంకర్ రెడ్డి రచన చేశారు. మోహన్ లాల్ తో పాటు ఈ చారిత్రక నాటక చిత్రంలో భాస్కర్ బివి, రోషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఫిబ్రవరిలో, నటుడు ‘వృషభ’ సెట్స్ నుండి ఒక వీడియోను పంచుకున్నాడు.

సినిమా షూటింగ్ ముగిసినట్లు ప్రకటించాడు. వీడియో పోస్ట్‌లో అతను కేక్ కట్ చేసి బృందంతో కలిసి సందడి చేసినట్లు అందులో ఉంది. ఇదిలా ఉంటే మోహన్‌లాల్‌కు.. మలయాళ నటుడు మమ్ముట్టి, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, సునీల్ శెట్టి, దుల్కర్ సల్మాన్, మంజు వారియర్ సహా సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియాలో హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

తరవాత కథనం