The Paradise First Look: ‘దసరా’ తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ది పారడైస్’. ఇది నాని కెరీర్ లో ఇప్పటివరకు చేయని డిఫరెంట్ కాన్సెప్ట్, కథాంశంతో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో నాని లుక్, మాటలు, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలో సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నాని ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు అతడి పాత్రను పరిచయం చేశారు. ఇందులో నాని “జడల్” అనే పాత్రలో కనిపించబోతున్నారు.
నాని ఫస్ట్ లుక్
పోస్టర్‌లో నాని ఒక సింహాసనంపై కూర్చుని ఉండగా.. అతడి చుట్టూ శత్రువులు ఆయుధాలతో ఉంటారు. అయినప్పటికీ నాని ఎంతో ప్రశాంతంగా కూర్చుకున్న ఆ విజువల్ సినిమాలో అతడి పాత్ర ఎంత శక్తివంతమైనదో తెలియజేస్తోంది. మొహం పై గాయాలు, రగ్గడ్ అవతార్ లో నాని లుక్ ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది. నాని పాత్రలో క్రూరత్వం, గంభీరం రెండూ ఉన్నాయని తెలుస్తోంది.
పీరియాడిక్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేసిన భారీ యాక్షన్ సన్నివేశాల నుంచి ఆ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా ఉండబోతుందని సమాచారం. ‘పారడైస్; వచ్చే ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇందులో ఇప్పటివరకు చూడని ఒక కొత్త నానిని విట్నెస్ చేయబుతున్నట్లు అర్థమవుతోంది.






