Nithiin Tammudu: భారీ ధరకు అమ్ముడుపోయిన నితిన్ ‘తమ్ముడు’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

టాలీవుడ్ హీరో నితిన్‍ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతడికి నాలుగేళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. వరుస ప్లాఫ్‍లతో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది కూడా ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్‍హుడ్ మూవీతో వచ్చినా.. అది కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. 2020లో వచ్చిన భీష్మ తర్వాత నితిన్‍కు మరో సక్సెస్ లేదు. వరుసగా నిరాశ ఎదురవుతుంది.

చెక్, రంగ్‍దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్‍హుడ్ ఇలా వరుసగా ఫ్లాపులు చూశాడు. ఈ సారి ఎలాగైన ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ‘తమ్ముడు’ చిత్రంతో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఆలస్యమైన చిత్రం జూలై 4న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

నితిన్ ఈ సినిమాపై గంపెడాశ పెట్టుకున్నారు. ఈ సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో భారీ ధరకే కొనుక్కుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

ఒకవేళ ఇదే నిజమైతే.. ఈ సినిమా థియేట్రికల్ రన్ అనంతరం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రానుంది. డీల్ ప్రకారం… ఆగస్టులో ఈ చిత్రం ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఇవాళ (జూన్ 11) సాయంత్రం 5 గంటలకు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ మూవీలో నితిన్, లయ, సప్తమితో పాటు వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‍దేవ, స్వస్తిక కీలకపాత్రల్లో నటించారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం