హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర తారలు నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. YRF స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అంచనాలను మించిపోయింది. యాక్షన్ సన్నివేశాలు, థ్రిల్లింగ్ కథాంశం, అద్భుతమైన విజువల్స్ తో నిండిన ఈ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
ట్రైలర్ ప్రారంభం నుంచే భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో అలరించింది. హృతిక్ రోషన్ తన ఎనర్జిటిక్ యాక్షన్ తో మరోసారి ఆకట్టుకోగా, జూనియర్ ఎన్టీఆర్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ గా నిలిచింది. ఇద్దరు స్టార్ల మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కియారా అద్వానీ కూడా తన పాత్రలో ఆకట్టుకుంది.
ట్రైలర్ లోని డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ సినిమాను భారీ స్థాయిలో తెరకెెక్కినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ చూస్తుంటే, ‘వార్ 2’ కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, బలమైన కథాంశం, భావోద్వేగాలతో కూడిన థ్రిల్లర్ అని అర్థమవుతోంది. ‘వార్ 2’ ఆగస్టు 14, 2025న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.






