‘ఒసాకా తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ తమిళ సినిమా పరిశ్రమకు జపాన్ కు మధ్య వారధిలా పని చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రతి ఏడాది రిలీజ్ అయిన చిత్రాలలో బెస్ట్ యాక్టింగ్ కనబరిచిన వారికి అవార్డ్స్ ఇస్తూ సందడి చేస్తోంది. ఈ మేరకు 2023 సినిమాలకు సంబంధించి అవార్డుల వేడుకను ఏర్పాటుచేసింది. ఆ వేడుక బుధవారం ఘనంగా జరిగింది. ఇందులో విజేతలకు అవార్డులు అందించింది.
ఉత్తమ చిత్రం ‘మామన్నన్’ (ఉదయనిధి స్టాలిన్ హీరో).
ఉత్తమ నటుడిగా అజిత్ (తునివు).
ఉత్తమ నటిగా త్రిష (లియో).
ఉత్తమ దర్శకుడిగా వెట్రిమారన్ (విడుదలై పార్ట్ 1).
ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ (మామన్నన్, పొన్నియిన్ సెల్వన్ 2).
విజయ్ హీరోగా నటించిన ‘లియో’అత్యధికంగా 6 విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది.
ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్: విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్: ఐశ్వర్యా రాయ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ విలన్: ఫహాద్ ఫాజిల్ (మామన్నన్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస (లియో)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్: నెల్సన్ దిలీప్‌కుమార్ (జైలర్), ఆల్ఫ్రడ్ ప్రకాశ్, విఘ్నేశ్ రాజా (పోర్ తొళిల్)
ఉత్తమ ప్రొడక్షన్ హౌస్: మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎఆర్పీ ఎంటర్‌టైన్‌మెంట్స్ (గుడ్‌నైట్ మూవీ)
ఉత్తమ కొరియోగ్రాఫర్: దినేశ్ కుమార్ (లియోలోని నాన్ రెడీ సాంగ్‌కు)
ఉత్తమ ఎడిటర్: ఫిలోమిన్ రాజ్ (లియో)
ఉత్తమ స్టంట్ డైరెక్టర్: అన్బరివ్ (లియో)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: మిలాన్ ఫెర్నాండెజ్ (తునివు)
ఉత్తమ వీఎఫ్‌ఎక్స్ టీమ్: అల్జరా స్టూడియో (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ సౌండ్ డిజైనర్: సింక్ సినిమా (లియో)
క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిల్మ్ (ప్రశంసలు అందుకున్న చిత్రం): గుడ్‌నైట్