today ott movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు.. ఇక రచ్చ రచ్చే

ఓటీటీలోకి ఇవాళ అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒక్కరోజే 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. అందులో క్రైమ్, యాక్షన్, హారర్, కామెడీ, రొమాంటిక్ వంటి జోనర్స్‌లలో సినిమాలు, సిరీస్‌లు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

నాస్కార్ ఫుల్ స్పీడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్) మే 08

గుడ్ బ్యాడ్ అగ్లీ (తెలుగు డబ్బింగ్ సినిమా) మే 08

జాక్ (తెలుగు చిత్రం) మే 08

ఫరెవర్ (ఇంగ్లీష్ సిరీస్) మే 08

బ్లడ్ ఆఫ్ జీయూస్ సీజన్3 (ఇంగ్లీష్ యానిమేటేడ్ సిరీస్) మే 08

ది హాంటెడ్ అపార్ట్‌మెంట్ మిస్ కె (ఇండోనేషియన్ చిత్రం) మే 08

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఓదెల 2 (తెలుగు మూవీ) మే 08

టెన్ హవర్స్ (తమిళ చిత్రం) మే 08

ఈటీవీ విన్ ఓటీటీ

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (తెలుగు చిత్రం) మే 08

ఇలా నేడు ఒక్కరోజే మొత్తం 9 సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చాయి. వాటిలో తమిళ హీరో అజిత్ కుమార్, త్రిష, అర్జున్ దాస్, షైన్ టామ్ చాకో, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ, సిద్ధు జొన్నలగడ్డ-వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన జాక్ మూవీ స్పెషల్‌గా ఉన్నాయి.

అలాగే మిల్కీ బ్యూటి తమన్నా హారర్ థ్రిల్లర్ ఓదెల 2, యాంకర్స్ ప్రదీప్-దీపికా పిల్లి జంటగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, హారర్ మిస్టరీ థ్రిల్లర్ ది హాంటెడ్ అపార్ట్‌మెంట్ మిస్ కె, తమిళ క్రైమ్ యాక్షన్ టెన్ హవర్స్ కూడా స్పెషల్‌గా ఉన్నాయి.

 

తరవాత కథనం