Paradha Trailer: ఆసక్తి రేపుతున్న అనుపమ ‘పరదా’ ట్రైలర్.. ఇక్కడ చూడండి

Paradha Trailer

Paradha Trailer: అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘పరదా’ ట్రైలర్ విడుదలైంది. గ్రామీణ నేపథ్యం కథాంశంతో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో అనుపమ పల్లెటూరి అమ్మాయి ‘సుబ్బు’ పాత్రలో నటించింది. గ్రామంలోని సంప్రదాయాలు, కట్టుబట్టలు, ఆచారాల మద్య మహిళలు ఎలా నలిగిపోతున్నారు అనే అంశాలను ట్రైలర్లో చూపించారు. అనుపమతో పాటు సీనియర్ నటి సంగీత, దర్శన్ రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. మూడు భిన్న దారుల నుంచి వచ్చిన ఈ ముగ్గురి ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ట్రైలర్ లో వీరి మధ్య సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సుబ్బు తన మొహాన్ని ఎప్పుడు పరదాతో ఎందుకు కప్పి ఉంచుతుంది? ఆమె అలా చేయడం వెనుక ఉన్న రహస్యమేంటి? ఆ ఊరిలోని సంప్రదాయాల వల్ల ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం.

 

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం