పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ చూసేందుకు ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. రీసెంట్‌గా డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా నోచుకోలేదు. ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఈ చిత్రాన్ని జూన్ 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అది కూడా ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇప్పుడు ఈ మూవీ రిలీజ్‌పై పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్‌లో సైతం అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఒక్కటే.. హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడూ అని. దీంతో పలు డేట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా జూన్ 26న రిలీజ్ కాబోతోందని రీసెంట్ గా ఓ పోస్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కానీ దాన్ని నమ్మొద్దని నిర్మాణ సంస్థ చెప్పింది. ఈ నేపథ్యంలో నిర్మాతకు పవన్ గుడ్ న్యూస్ చెప్పాడు.
ఈ మూవీ ప్రమోషన్స్‌లో తాను పాల్గొంటానని ప్రొడ్యూసర్ ఏఎం రత్నంకు పవన్ చెప్పినట్లు సమాచారం. సాధారణంగా పవన్ బిజీ షెడ్యూల్ కారణం మూవీ ప్రమోషన్లలో తక్కువగానే కనిపిస్తారు. కానీ ఈ సినిమా కోసం మాత్రం తాను రంగంలోకి దిగుతానని చెప్పినట్లు సమాచారం. ఇకపోతే ఈ హిస్టరికల్ పీరియాడిక్ డ్రామా మూవీలో అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, వెన్నెల కిశోర్, అనసూయ తదితరులు నటించారు.






