Hari Hara Veera Mallu Making Video: పవన్ ఎంత కష్టపడ్డాడో చూడండి.. ‘హరిహర వీరమల్లు’ మేకింగ్ వీడియో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “హరి హర వీరమల్లు” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరుగా సాగిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. అలాగే జూలై 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో సినిమాపై అంచనాలను మరింత పెంచుతూ “హరిహర వీరమల్లు: ది స్టోరీ బిహైండ్ ది స్టార్మ్” పేరుతో తాజా మేకింగ్ వీడియోను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.

ఈ వీడియోలో సినిమా కోసం నిర్మించిన భారీ సెట్టింగ్‌లు, పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ సాధన, ఫైట్ రిహార్సల్స్ వంటివి చూపించారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణతో పాటు మొత్తం చిత్ర బృందం పడ్డ కష్టం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలోని విజువల్ గ్రాండియర్, గ్రాఫిక్స్ పనులు, యాక్షన్ సన్నివేశాలు ఎలా రూపొందించారో ఈ మేకింగ్ వీడియోలో హైలైట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో కీలక విలన్‌గా కనిపించనున్నారు. నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్ వంటి తారలు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఎ.ఎం. రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం