పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టేసాడు. ప్రస్తుతం 2 సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చిత్రం ఒకటి కాగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మూవీ రెండవది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్ శర వేగంగా జరుగుతున్నాయి. వీటి తర్వాత ప్రభాస్ లైన్ లో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి.
అందులో స్పిరిట్ ఒకటి. మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో నటిస్తున్నాడు. యానిమల్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని కలెక్షన్స్ వర్షం కురిపించిన సందీప్ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాలో ప్రభాస్ను ఓ రేంజ్ లో చూపిస్తానని అన్నాడు. అంతే కాకుండా ఈ మూవీలో మరింత మంది స్టార్ క్యాస్టింగ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ను ఢీకొట్టే పాత్రలో కొరియన్ స్టార్ హీరో కనిపించబోతున్నాడని సమాచారం. అలాగే ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్గా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. అలియా భట్, మృనాల్ ఠాకూర్, రష్మిక మందన వంటి స్టార్ హీరోయిన్లు ఈ లిస్ట్ లో ఉన్నారు.
ఇప్పుడు ఈ లిస్టులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు వినిపిస్తోంది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా ఫైనల్ అయినట్లు గట్టి టాక్. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఆమె భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. దీనికోసం ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాల సమాచారం.
అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. ఇప్పటికే ఆమె ప్రభాస్తో కల్కి సినిమాలో నటించి అదరగొట్టేసింది. అందువలన ఇప్పుడు ఈ సినిమా కోసం సందీప్ ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది.