కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నాడు. తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. లవ్ టుడే సినిమాతో బాగా ఫేమస్ అయిపోయాడు. ఆ సినిమాలో దర్శకునిగా.. హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఇటీవల డ్రాగన్ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
ఇలా ఓవైపు దర్శకునిగా మరోవైపు హీరోగా దూసుకుపోతున్నాడు. డ్రాగన్ మూవీ హిట్ తో తెలుగు నిర్మాతలతో ఓ సినిమా కు ఓకే చెప్పేసాడు. మైత్రి మూవీ మేకర్స్ తో జతకట్టాడు. కీర్తి స్వరన్ డైరెక్టర్ గా డిబ్యు చేయబోతున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రేమలో బ్యూటీ మమత బైజు హీరోయిన్గా నటిస్తుంది.
తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మూవీ టైటిల్ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి “డ్యూడ్ ” అనే టైటిల్ ఖరారు చేశారు. యూత్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ లో ప్రదీప్ రంగనాథన్ లుక్ అదిరిపోయింది.
సీరియస్ అండ్ ఇంటెన్స్ లుక్ లో దర్శనమిచ్చాడు. ఈ పోస్టర్ ఊర మాసుగా ఉండడంతో అభిమానులు ఫుల్ కుష్ అవుతున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ చిత్రం మోడ్రన్ ట్విస్ట్ తో రాబోతున్నట్లు కనిపిస్తోంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు.