హే గాయ్స్! Varanasi and Ramayana ఈ రెండు సినిమాలు కూడా ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్‌కి తీసుకువెళ్లగలిగే కైండ్ ఆఫ్ సినిమాలే. అందుకే వీటిని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు అని అనున్నా, ఈ రెండూ కూడా రామాయణం ఓరియెంటెడ్ కథాంశాన్ని కలిగి ఉండటం వల్ల పోలికలు అనివార్యం అయ్యాయి. మనం ఇప్పుడు ఈ రెండు మెగా ప్రాజెక్టుల విజన్ , జానర్ పరంగా తేడాలు చూద్దాం!
రామాయణం: ప్యూర్ కల్చర్ ఓరియెంటెడ్
నితీష్ తివారి రామాయణ సినిమా కంప్లీట్‌గా రామాయణం ఆధారంగా, ప్యూర్ కల్చర్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. ఈ కథాంశం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందింది.
వారణాసి: మైండ్ బాగ‌్లింగ్ జానర్ మిక్స్
రాజమౌళి వారణాసి సినిమా దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా కేవలం రామాయణం చుట్టూ తిరిగే థీమ్ మాత్రమే అయినప్పటికీ, ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా! అంతేకాదు, ఇది టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్, హిస్టారికల్ అంశాలు, యాక్షన్, అడ్వెంచర్ వంటి మల్టిపుల్ జానర్‌లను మిక్స్ చేస్తూ వస్తున్న ఒక మైండ్ బాగలింగ్ సినిమా.
రాజమౌళి ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల కోసం పర్ఫెక్ట్ సినిమాని ఇస్తున్నారు. ఈ జానర్ మిక్స్ కారణంగానే, వారణాసికి గ్లోబల్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందనిపిస్తుంది. ఎందుకంటే, విదేశీ ఆడియెన్స్ కేవలం కల్చరల్ బేసిస్‌లో ఉన్న రామాయణ కంటే, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, అడ్వెంచర్ వంటి అంశాలు ఉన్న వారణాసిని “వావ్! ఇలాంటి సినిమా ఎప్పుడూ చూడలేదు” అనే ఫీలింగ్‌తో చూసే అవకాశం ఉంది.
రాజమౌళి గ్లోబల్ ఇంపాక్ట్: RRR మ్యాజిక్
రాజమౌళి విజన్ ఎందుకు నెక్స్ట్ లెవెల్ అంటే, ఆయనకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి పేరు ఉంది.
• హాలీవుడ్‌లో పెద్ద పెద్ద డైరెక్టర్లు రాజమౌళిని అభినందించారు.
• చాలా పెద్ద హాలీవుడ్ షోలకు ఆయన వెళ్లారు.
• RRR సినిమాని నార్త్ అమెరికా మొత్తం చూసింది. హాలీవుడ్ నటీనటులు కూడా RRR గురించి మాట్లాడారు.
ఈ కారణాల వల్ల రాజమౌళి ఇంపాక్ట్ గ్లోబల్ స్థాయిలో ఉంది. దీనికి దగ్గరగా ఏ ఇండియన్ డైరెక్టర్‌ను కూడా పోల్చలేం.
మరోవైపు, నితీష్ తివారి ఇంపాక్ట్ ఎక్కువగా ఇండియా వరకు మాత్రమే ఉంది. ఆయన తీసిన దంగల్ (Dangal) సినిమా చైనాలో హిట్ అయి ఉండొచ్చు. దంగల్ డైరెక్టర్ అని చెప్పి కొంత మార్కెటింగ్ జరగొచ్చు. కానీ, కేవలం ప్యూర్ రామాయణం సినిమా చైనాలో ఎంతవరకు ఇంపాక్ట్ ఇస్తదో మనం చెప్పలేము, ఎందుకంటే అది కల్చర్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి.
రాజమౌళి గ్లోబల్ నేమ్ కారణంగా, వారణాసి సినిమా కచ్చితంగా గ్లోబల్ ఆడియన్స్‌ను సులభంగా ఆకర్షించగలుగుతుంది.
బడ్జెట్ అవుట్‌పుట్ డిఫరెన్స్
బడ్జెట్ పరంగా చూసుకుంటే, నితీష్ తివారి రామాయణ బడ్జెట్ ఎక్కువ ఉంది. రామాయణ రెండు పార్ట్‌లకు కలిపి 4000 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు.
రాజమౌళి వారణాసి బడ్జెట్ 1200 కోట్లు. ఇది కూడా ఒక పెద్ద హాలీవుడ్ సినిమా బడ్జెట్.
కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, తక్కువ బడ్జెట్‌లో ఎంత ఎక్స్‌ట్రార్డినరీ అవుట్‌పుట్ ఇవ్వాలో రాజమౌళికి బాగా తెలుసు. బాలీవుడ్ వాళ్లు కొన్నిసార్లు అంత విజన్ లేక ఎక్కువ బడ్జెట్ పెట్టి, తక్కువ అవుట్‌పుట్ ఇస్తారు. ఉదాహరణకు, మిరాయి లాంటి సినిమాకి బాలీవుడ్ 250 కోట్లు పెడితే, మన వాళ్లు 60 కోట్ల బడ్జెట్‌లో అంతకంటే బెటర్ అవుట్‌పుట్ తీశారు.
అందుకే, బడ్జెట్ పరంగా రామాయణ ఎక్కువగా ఉన్నా, అవుట్‌పుట్ మాత్రం వారణాసిదే బెస్ట్ ఉంటుంది. రాజమౌళి క్లారిటీ, విజన్, కలర్ బర్నింగ్ వంటి వాటిపై ఆయన తీసుకునే శ్రద్ధ వల్ల, అవుట్‌పుట్ 200% బెస్ట్ ఉంటుంది.
ఫైనల్ పాయింట్: రాజమౌళి విజన్, మల్టీ-జానర్ అప్రోచ్ తక్కువ బడ్జెట్‌లో కూడా బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వగల ఆయన సామర్థ్యం కారణంగా, వారణాసి సినిమా గ్లోబల్ వార్‌లో ముందంజలో ఉంటుంది.






