Coolie Advance Booking:సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’, ఎన్టీఆర్- హృతిక్ వార్ 2 చిత్రాలు బాక్సాఫీస్ పోటీకి సిద్ధమయ్యాయి. రెండు సినిమాలు ఒకేరోజు (ఆగస్టు 14న) విడుదలవుతుండడంతో ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి ‘కూలీ’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇండియాలో మాత్రమే కాదు ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఓవర్ సీస్ లో రికార్డు ప్రీ సేల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో $1.3 మిలియన్లు ఒక్క నార్త్ అమెరికా నుంచే వచ్చాయి. మొత్తం నార్త్ అమెరికాలో 50,000 టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.
కేరళ, కర్ణాటకలో ఆగస్టు 14న ప్రత్యేకంగా ఎర్లీ మార్నింగ్ షోలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు కొన్ని ప్రీమియం థియేటర్లు మిడ్ నైట్ షోలు, ఫ్యాన్స్ స్పెషల్ షోలు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
హై యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతి హాసన్ వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రలు పోషించారు. ఉన్నారు.






