COOLIE MOVIE: విడుదలకు ముందే ఓటీటీలో.. ‘కూలీ’ నుంచి ఫ్యాన్స్ కి అదిరే సర్ప్రైజ్

COOLIE MOVIE: సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ మరో మూడు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ట్రైలర్, పాటలు విడుదల చేయగా.. తాజాగా ఫ్యాన్స్ కోసం మరో సర్ప్రైజ్ ఇచ్చారు.

ఓటీటీలో ఆడియో లాంచ్

ఇటీవలే చెన్నై వేదికగా జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్ కార్యక్రమాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. లైవ్ ఈ ఈవెంట్ చూసే అవకాశం మిస్సైన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు. సన్ నెక్స్ట్ వేదికగా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఈవెంట్ లో రజినీకాంత్ స్పీచ్ తో పాటు, అనిరుధ్ లైవ్ పర్ఫార్మెన్స్, ఇతర అగ్రతారల పంచుకున్న విశేషాలు ఉన్నాయి. ‘కూలీ అన్ లీష్డ్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని విడుదల చేశారు. ఇది సినిమాకు మరింత బజ్, హైప్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.

రజినీ- లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో డిఫరెంట్ ఇండస్ట్రీలకు చెందిన 5 మంది స్టార్స్ కనిపించబోతున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి రజనీకాంత్, తెలుగు నుంచి నాగార్జున, మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి సౌబిన్ షాహిర్, కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఉపేంద్ర అలాగే హిందీ చిత్ర పరిశ్రమ నుంచి ఆమిర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. దీంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘కూలీ’ ఆగస్టు 14న విడుదల కానుంది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం