కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫుల్ జోష్ లో ఉన్నారు. యంగ్ హీరోలకి ఏమాత్రం తగ్గని ఎనర్జీతో వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ లైన్లో రెండు సినిమాలో ఉన్నాయి. అందులో ఒకటి జైలర్ 2 మూవీ. ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్నాడు. అలాగే రెండో చిత్రం కూలీ. ఈ చిత్రానికి మాస్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఇందులో టాలీవుడ్ హీరో నాగార్జున, కన్నడ హీరో ఉపేంద్ర, శృతిహాసన్ వంటి నటీనటులు కీలకపాత్ర పోషిస్తున్నడంతో మరింత బజ్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని రజిని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో అతిపెద్ద సర్ప్రైజ్ అందించారు. మరో 100 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుపుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు అది నెట్టింట ట్రెండ్ అవుతుంది.
పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ గ్యాంగ్ స్టార్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో విశేషమేంటంటే ఈ సినిమా రిలీజ్ రోజునే బాలీవుడ్ వార్ 2 చిత్రం రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కానుండడంతో అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది.