Peddi Movie: ‘పెద్ది’ లో రచ్చ చేయబోతున్న చిట్టి బాబు- రామలక్ష్మి!

peddi update

Peddi Movie: ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా- రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న ‘పెద్ది’ పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లిమ్ప్స్ వీడియో సోషల్ మీడియాలో సెన్షేషన్ క్రియేట్ చేయగా.. తాజాగా ఈ సినిమాకు మరో అప్డేట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెరవనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ‘రంగస్థలం’ లో జంటగా మెరిసిన చిట్టి బాబు- రామలక్ష్మీ ‘పెద్ది’ తో మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

‘ఊ అంటావా మావ’ రేంజ్ లో

ఇప్పటికే పుష్ప 2 లో ”ఊ అంటావా మావ’ ఐటెం నెంబర్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సామ్.. ఇప్పుడు కూడా తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే బుచ్చిబాబు కూడా తన గురువు సుకుమార్ అడుగుజాడల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఇప్పుడు బుచ్చిబాబు కూడా అదే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత సామ్ బిగ్ స్క్రీన్ పై కనిపించబోతున్నారనే వార్త ఆమె ఫ్యాన్స్ లో సంతోషాన్ని నింపింది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం