Sreeleela: మరో స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ పట్టేసిన శ్రీలీల!

Sreeleela: తెలుగులో వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది యంగ్ బ్యూటీ శ్రీలీల. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటోంది. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది ఈ బ్యూటీ. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ జోడిగా ఆషిక్ 3తో పాటు మరో ప్రాజెక్ట్ చేస్తోంది. ఇక కోలీవుడ్ లో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న ‘పరాశక్తి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరో క్రేజీ ప్రాజెక్ట్

అయితే తాజా అప్డేట్ ప్రకారం.. శ్రీలీల కోలీవుడ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టేసినట్లు తెలుస్తోంది. అజిత్ హీరోగా రాబోతున్న సినిమాలో శ్రీలీల ఒక కీలక పాత్రలో నటించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీలీల తెలుగులో రవితేజ సరసన ‘మాస్ జాతర’ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదలవగా.. శ్రీలీల లుక్, స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకుంది. ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ, స్టూడెంట్ పాత్రలో శ్రీలీల మధ్య సన్నివేశాలు అలరించాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ లో పాల్గొంటుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వరుస అవకాశాలు, సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఈ ముద్దుగుమ్మ సక్సెస్ రేట్ మాత్రం తక్కువని నెటిజన్ల అభిప్రాయం. ధమాకా, భగవంత్ కేసరి తప్పా శ్రీలల నటించిన మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అనిపించుకున్నాయి. కానీ శ్రీలీల మాత్రం తన గ్లామర్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వరుస అవకాశాలు చేజిక్కించుకుంటుంది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం