SSMB29 – Globe Trotter: మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న SSMB29 అప్డేట్ రానే వచ్చేసింది. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. SSMB29 ఫస్ట్ లుక్ నవంబర్ లో విడుదల చేయనున్నట్లు ఎక్స్ లో ట్వీట్ చేశారు. మహేష్ బాబును ‘గ్లోబల్ ట్రోట్టర్’ గా అభివర్ణిస్తూ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ బాబు హాఫ్ లుక్ మాత్రమే కనిపిస్తుంది. మెడలో త్రిశూలం, ఆవుతో కూడిన రుద్రాక్ష, చుట్టూ రక్తపు మరకలతో లుక్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. జక్కన్న అప్డేట్ మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
గ్లోబల్ ట్రోట్టర్
గ్లోబల్ ట్రోట్టర్ అంటే ప్రపంచమంతా ప్రయాణించే వ్యక్తి అని అర్థం. దీని ప్రకారం మహేష్ ఈ సినిమాలో ఒక అన్వేషకుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే పోస్టర్ లో మహేష్ బాబు మెడలో త్రిశూలం, రుద్రాక్ష చూస్తుంటే పురాణం కథలు, ఆధ్యాత్మిక అంశాలను మిళితం చేసి సినిమాను రూపొందించినట్లు ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఆఫ్రీకన్ అడవుల్లో, వివిధ దేశాల్లో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. SSMB29 కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద రాయగా… జక్కన్న తెరకెక్కిస్తున్నారు.
రూ. 500 కోట్ల బడ్జెట్
సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా విజువల్ వండర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవగా మహేష్ బాబుకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్, ఒడిశా ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ దక్షిణాఫ్రికా, కెన్యా, టాంజానియా వంటి దేశాల్లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఇందులో మహేష్ బాబు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. పృథ్వీ రాజ్ సుకుమారన్, మాధవన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
‘ఆర్ ఆర్ ఆర్’ జక్కన నుంచి వస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.






