suhas mandaadi: కిక్కిచ్చిన లుక్కు.. ‘మండాడి’ నుంచి సుహాస్ ఊరమాస్ అవతార్

టాలీవుడ్ హీరో సుభాష్ పేరు ఇప్పుడు మరో భాషలో గట్టిగా వినిపిస్తుంది. తెలుగులో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చిన సుభాష్ ఒక్కసారిగా హీరోగా ప్రమోషన్ పొంది వరుస హిట్లు కొడుతున్నాడు. ఇప్పుడు తమిళ్ లో ఛాన్స్ కొట్టేశాడు. మండాడి అనే ఒక భారీ బడ్జెట్ చిత్రంతో తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.

స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో అతడు ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇందులో తమిళ నటుడు సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా స్టోరీకి బలమైన ప్రత్యేకత ఉండడంతో తెలుగులో మంచి నటనతో అదరగొడుతున్న సుహాస్ ను తీసుకున్నారు.

ఈ చిత్రంలో డిఫరెంట్ సినిమా అవుతుందని అంత భావిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మేరకు సుహాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో అతడు లుక్కు చూస్తుంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇందులో సుహాస్ సునామి రైడర్స్ టీంకు కెప్టెన్గా కనిపించనున్నాడు.

అయితే అతడు ఇందులో హీరోనా లేక విలనా అనేది మేకర్స్ వెల్లడించలేదు. ఈ చిత్రానికి దర్శక నిర్మాత వెట్రిమారన్ సహా ప్రొడ్యూసర్ గా ఉన్నారు. కాగా కథ, పాత్రలు, సన్నివేశాలు అన్నీ కలిపి ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్ కానుంది.

తరవాత కథనం