Actor Darshan: రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ కి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు కర్ణాటక హైకోర్టు గతేడాది బెయిల్ ఇవ్వగా.. ఇప్పుడు ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దర్శన్ బెయిల్ రద్దు చేయాలని ఆదేశించి. అతడికి బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని, వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు కొన్ని గంటల క్రితం నటుడు దర్శన్ సహా నిందితురాలు పవిత్ర గౌడ్ ని బెంగళూరులో అరెస్టు చేశారు. అనంతరం ఇద్దరినీ ట్రయల్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించి జైలుకు తరలించనున్నారు.
బెయిల్ ఎందుకు రద్దు
అయితే దర్శన్ బెయిల్ ని వ్యతిరేకిస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దర్శన్ కి బెయిల్ ఇవ్వడం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించింది. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న.. జస్టిస్ బేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం బెయిల్ రద్దు దర్శన్ బెయిల్ రద్దు చేయాలని ఆదేశించింది. అయితే ఈసారి జైల్లో దర్శన్ కి ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ అవసరంలేదని.. అలా కాదని చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించింది సుప్రీం కోర్టు. గతంలో దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నప్పుడు పొగ తాగుతూ.. పేరుమోసిన నేరస్తులతో తిరిగుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో సుప్రీం కోర్టు ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంది.
ఈ కేసులో దర్శన్ తో పాటు సహ నిందితులు అయిన ఎం, నాగరాజు, ప్రదూష్, లక్ష్మణ్ లను సైతం పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు జగదీష్, అనుకుమార్ ను కూడా త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు పేర్కొన్నారు.
అసలు కేసు ఏంటి.?
అయితే కొన్ని నెలల క్రితం హత్యకు గురైన రేణుక స్వామి అనే అభిమాని.. దర్శన్ సన్నిహితురాలు పవిత్ర గౌడ్ కి అసభ్యకర సందేశాలు పంపడానే కోపంతో దర్శన్ అతడిని కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత అతడిని టార్చర్ పెట్టి చంపేసినట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది. ఈ కేసులో దర్శన్ తో పాటు మొత్తం 17 మంది నిందితులు ఉన్నారు.






