The Goat Lif : ‘ఆడు జీవితం’ మూవీకి అరుదైన గౌరవం.. ఏకంగా 9 అవార్డులు కైవసం

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గతంలో నటించిన “ఆడు జీవితం ” సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు బ్లేస్సి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. అందర్నీ ఆకట్టుకునే విధంగా సౌదీలో కూలీలు పడే కష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందులు, అనుభవించిన బాధలు చూపించి సక్సెస్ అయ్యాడు.

గత ఏడాది మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎంతోమంది సినీ ప్రియుల్ని అలరించింది. దాదాపు ఈ సినిమా తెరకెక్కడానికి పదహారేళ్లు పట్టింది. ఇలా ఎన్నో ఏళ్ళు కష్టపడి తీసిన ఈ చిత్రం అంచనాలకు మించి భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఏకంగా 150 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి మలయాళం లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల జాబితాలో నిలిచిపోయింది.

ఈ చిత్రంలో పృధ్విరాజ్ కు జోడిగా అమలాపాల్ నటించింది. జెట్ మీడియా ప్రొడక్షన్స్, విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, ఆల్టా గ్లోబల్ మీడియా కలిసి సహితంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇలా థియేటర్లు, ఓటిటిలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రానికి తాజాగా మరో అరుదైన ఘనత లభించింది. తాజాగా తిరువనంతపురం వేదికగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల 54వ వేడుక జరిగింది.

ఈ వేడుకలో ఆడు జీవితం సినిమాకి అవార్డుల పంట పండింది. ఈ వేడుక కోసం మలయాళ చిత్ర సీమకు చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చీఫ్ గెస్ట్ గా వచ్చి విజేతలకు అవార్డులు అందించారు. ఇందులో భాగంగానే “ఆడు జీవితం” చిత్రానికి గాను పృధ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు. ఇది మాత్రమే కాకుండా ఈ సినిమా మరో తొమ్మిది విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుని అదరగొట్టేసింది.

తరవాత కథనం