thug life movie ott: ఓటీటీలోకి ‘థగ్ లైఫ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కమల్ హాసన్, మణిరత్నం కాంబో దాదాపు 37 ఏళ్ల తర్వాత రిపీట్ అయింది. ఈ కాంబో నుంచి ఇటీవల ‘థగ్ లైఫ్’ సినిమా వచ్చింది. ఇందులో త్రిష, శింబు లాంటి స్టార్ నటీ నటులు నటించడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా భావించారు. కానీ థియేటర్లలలో బొమ్మ పడిన తర్వాత అందరి ఆశలు నిరాశలయ్యాయి.

ఈ సినిమా థియేటర్లకు వచ్చాక ఊహించని ఫలితం అందుకుంది. దారుణమైన టాక్‌ను మూటగట్టుకుంది. కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. కానీ ఈ సినిమా విడుదలకు ముందే శాటిలైట్, ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. దీని డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీని కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.149.7 కోట్లు చెల్లించింది.

అలాగే విజయ్ టీవీ రూ.60 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా రూ.210 కోట్లు రాబట్టింది. దీంతో ఈ సినిమా ఓటీటీ పై అందరి కన్ను పడింది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్‌కు వస్తుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ‘థగ్ లైఫ్’ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

థియేటర్ రన్ అనంతరం ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. థగ్ లైఫ్ మూవీ థియేట్రికల్ రిలీజ్ అయిన 8వ వారం తర్వాత ఓటీటీలోకి తీసుకొస్తామని నెట్‌ఫ్లిక్స్‌ అనౌన్స్ చేసింది. అంటే ఆగస్టు 7న ఇది ఓటీటీలోకి రానుంది. మరి మొదట అనుకున్నట్లు 8వ వారం తర్వాతే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తుందా? లేక ముందుగానే ఓటీటీలోకి వస్తుందా? అనేది చూడాలి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం