గద్దర్ అవార్డులపై సినీనటుడు, జ్యూరీ ఛైర్మన్ మురళీమోహన్, ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు 2014 నుంచి 2023 వరకు రిలీజ్ అయిన చిత్రాలకు గానూ గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఇందులో భాగంగానే ఏడాదికి 3 సినిమాలకు చొప్పున అవార్డులను వెల్లడించారు. ఇవి మాత్రమే కాకుండా సినీ రంగానికి సేవలు అందించిన ప్రముఖులకు 6 ప్రత్యేక అవార్డులు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు దివంగత కాళోజీకి ప్రత్యేక జ్యూరీ అవార్డును అనౌన్స్ చేశారు.
సంవత్సరాల వారీగా ఉత్తమ చిత్రాలివే..
2014
ప్రథమ ఉత్తమ చిత్రం: రన్ రాజా రన్
రెండో ఉత్తమ చిత్రం: పాఠశాల
మూడో ఉత్తమ చిత్రం : అల్లుడు శీను
2015
ప్రథమ ఉత్తమ చిత్రం: రుద్రమదేవి
రెండో ఉత్తమ చిత్రం: కంచె
మూడో ఉత్తమ చిత్రం: శ్రీమంతుడు
2016
ప్రథమ ఉత్తమ చిత్రం: శతమానం భవతి
రెండో ఉత్తమ చిత్రం: పెళ్ళి చూపులు
మూడో ఉత్తమ చిత్రం: జనతా గ్యారేజ్
2017
ప్రథమ ఉత్తమ చిత్రం: బాహుబలి 2
రెండో ఉత్తమ చిత్రం: ఫిదా
మూడో ఉత్తమ చిత్రం: ఘాజీ
2018
ప్రథమ ఉత్తమ చిత్రం: మహానటి
రెండో ఉత్తమ చిత్రం: రంగస్థలం
మూడో ఉత్తమ చిత్రం: కేరాఫ్ కంచరపాలెం
2019
ప్రథమ ఉత్తమ చిత్రం: మహర్షి
రెండో ఉత్తమ చిత్రం: జెర్సీ
మూడో ఉత్తమ చిత్రం: మల్లేశం
2020
ప్రథమ ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో..
రెండో ఉత్తమ చిత్రం: కలర్ ఫొటో
మూడో ఉత్తమ చిత్రం: మిడిల్ క్లాస్ మెలొడీస్
2021
ప్రథమ ఉత్తమ చిత్రం: ఆర్‌ఆర్‌ఆర్
రెండో ఉత్తమ చిత్రం: అఖండ
మూడో ఉత్తమ చిత్రం: ఉప్పెన
2022
ప్రథమ ఉత్తమ చిత్రం: సీతారామం
రెండో ఉత్తమ చిత్రం: కార్తికేయ 2
మూడో ఉత్తమ చిత్రం: మేజర్
2023
ప్రథమ ఉత్తమ చిత్రం: బలగం
రెండో ఉత్తమ చిత్రం: హనుమాన్
మూడో ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ
పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు: మణిరత్నం
బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సుకుమార్
నాగిరెడ్డి – చక్రపాణి ఫిల్మ్ అవార్డు: అట్లూరి పూర్ణచంద్రరావు
కాంతారావు ఫిల్మ్ అవార్డు: విజయ్ దేవరకొండ
రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్