విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మోస్ట్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్‌లో రెండేళ్ల కిందట వచ్చిన ఈ సిరీస్ సంచలన విజయాన్ని అందుకుంది. ఇద్దరు తెలుగు హీరోలు నటించిన ఈ సిరీస్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బూతు డైలాగులు, మితిమీరిన శృంగార సన్నివేశాలకు సినీ ప్రియులు షాక్ అయ్యారు.
నిజ జీవితంలో బాబాయ్ అబ్బాయ్‌లుగా ఉన్న వెంకీ, రానాలు.. ఈ సిరీస్‌లో తండ్రీకొడుకులుగా నటించి అదరగొట్టేశారు. ఇక ఈ సిరీస్‌కు వచ్చిన రెస్పాన్స్ బట్టి సెకండ్ సీజన్ కూడా వస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు మేకర్స్ ఒక్కో అప్డేట్ అందిస్తూ ఈ సెకండ్ సీజన్ పై అంచనాలు పెంచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.
రానా నాయుడు సీజన్ 2 ఈ నెల అంటే జూన్ 13వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ తరుణంలో మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా ఉంది. మొదటి సీజన్ కు మించి యాక్షన్, రొమాంటిక్ సీన్లు ఈ కొత్త సీజన్‌లో ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సెకండ్ సీజన్లోనూ నాగా నాయుడు, రానా నాయుడు తండ్రీకొడుకులుగా ముఖాముఖి తలపడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సెకండ్ సీజన్ కూడా ఫుల్ యాక్షన్‌తో రాబోతున్నట్లు మేకర్స్ చెప్పారు.
కాగా ఈ సెకండ్ సీజన్‌ను ముగ్గురు డైరెక్షన్ చేశారు. కరణ్ అన్షుమన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. అలాగే ఇందులో వెంకటేశ్, రానా, అర్జున్ రాంపాల్, డీనో మోరియా, సుర్వీన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, కృతి కర్బందా వంటి నటీనటులు నటిస్తున్నారు. ఈ సీజన్ 2 హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.