Dheeraj Kumar Death News: ప్రముఖ నటుడు, నిర్మాత ధీరజ్ కుమార్ ఇకలేరు

Dheeraj Kumar Death News

Dheeraj Kumar Death News: ప్రముఖ నటుడు, టెలివిజన్ సీరియల్స్ నిర్మాత ధీరజ్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ 79 సంవత్సరాల వయసులో జులై 15 తెల్లవారుజామున ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. న్యూమోనియాతోపాటు వయోభారంతో వచ్చిన జబ్బులకు చాలా కాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన మరణ వార్త చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

శ్వాస సంబంధిత సమస్యలతో ఐసీయూలో చేరిక
వివిధ మీడియాలు రిపోర్ట్ చేసిన ప్రకారం ఈ వారంలోనే ధీరజ్ కుమార్ తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ మద్దతుతో ఐసీయూ చికిత్స అందించారు. చికిత్స పొందుతూ నేడు (జులై 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన కుటుంబం ఈ వార్తను ధృవీకరించింది.

ధీరజ్ కుమార్ సినీ ప్రయాణం
ధీరజ్ కుమార్ సినీ రంగంలో తన తొలి అడుగులు 1965లో వేశారు. హిందీ,పంజాబీ సినిమాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా 1970 నుంచి 1984 మధ్య కాలంలో ఆయన 21 పంజాబీ చిత్రాలలో నటించారు.

ప్రజాదరణ పొందిన సినిమాలు
– స్వామి
– హీరా పన్నా
– రాతోన్ కా రాజా
ఈ చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. పౌరాణిక పాత్రల్లో ఆయన పోషించిన పాత్రలు తిరుగులేనివిగా నిలిచాయి.

టెలివిజన్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు
ధీరజ్ కుమార్ నటనకు మాత్రమే కాక, టెలివిజన్ రంగంలోనూ విశేష పాత్ర పోషించారు. ఆయన స్థాపించిన “క్రియేటివ్ ఐ” సంస్థ పలు హిట్ కార్యక్రమాలను ప్రజలకు అందించింది. ముఖ్యంగా,
– ఓం నమః శివాయ్
– అథర్వవేద
– శ్రీ గణేశ్
వంటి ఆధ్యాత్మిక సీరియల్స్‌,పౌరాణిక కార్యక్రమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ప్రముఖుల స్పందనలు – సినీ పరిశ్రమలో విషాద ఛాయలు
ధీరజ్ కుమార్ మరణ వార్తపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమితాబ్ బచ్చన్,హేమ మాలిని,జితేంద్ర,బోమన్ ఇరానీ, తదితర బాలీవుడ్ ప్రముఖులు ఆయన మరణంపై ట్వీట్ చేశారు.
“ధీరజ్ కుమార్ నటుడిగా, నిర్మాతగా ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన మృదుస్వభావం, శ్రద్ధ, కష్టపడి పనిచేసే తత్వం మనకు ప్రేరణ.” అని ప్రముఖ దర్శకుడు రాకేష్ ఒంప్రకాశ్ మెహ్రా పేర్కొన్నారు.

అభిమానుల స్పందన
ఆయన సినీ జీవితానికి, టెలివిజన్ సీరియల్స్‌కు ప్రత్యేక అభిమాన ఘనం ఉంది. ఆయన పోషించిన ఆధ్యాత్మిక పాత్రలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన మరణంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అభిమానులు, కుటుంబ సభ్యులు, సహచరులు ఆయన పార్దీవ దేహానికి పుస్పాంజలి ఆర్పిస్తున్నారు.

మంచి నటుడు, గొప్ప నిర్మాతగా గుర్తింపు
ధీరజ్ కుమార్ ఒక మల్టీ టాలెంటెడ్ వ్యక్తిగా గుర్తింపు పొందారు. నటన, దర్శకత్వం, నిర్మాణం వంటి విభిన్న రంగాలలో ఒకే స్థాయిలో ముద్రవేశారు. ఆయన నిర్మించిన ధారావాహికలు, సినిమాలు ప్రజలకు ఆధ్యాత్మికమైన అనుభూతిని అందించాయి. భారతీయ టెలివిజన్ పరిశ్రమలో ఒక కొత్త దారిని చూపిన వ్యక్తిగా ఆయన పేరు నిలిచి ఉంటుంది.

అంతిమ సంస్కారాలు
ధీరజ్ కుమార్ అంత్యక్రియలు ముంబైలోని ఆయన స్వగృహం వద్ద నిర్వహించనున్నారు. ఆయన వృద్ధాప్య దశలో కుటుంబంతో సమయాన్ని గడిపారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడిపారు.
సినిమా ప్రపంచంలో తనదైన ముద్రవేసిన ధీరజ్ కుమార్ మరణం మనందరికీ ఎన్నటికీ మిగిలిపోయే లోటు. ఆయన చేసిన పనులు, సృష్టించిన పాత్రలు, నిర్మించిన కథలు ఎప్పటికీ తెరమీద చిరస్థాయిగా నిలుస్తాయి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం