maargan movie ott: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ ‘మార్గన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘మార్గన్: ది బ్లాక్ డెవిల్’. ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం జూన్ 27, 2025న థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తమ ఇళ్లలో నుంచే వీక్షించవచ్చు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని జూలై 25, 2025న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది.

‘మార్గన్’ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది. భారతదేశం వెలుపల, ఈ చిత్రం జూలై 25 నుండి టెంట్‌కొట్ట (Tentkotta) ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

‘మార్గన్’ ఒక సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ ఒక పోలీస్ అధికారి “ధృవ” పాత్రలో నటించారు. నగరంలో వరుసగా జరిగే వింత హత్యలు కథకు మూలం. ఈ హత్యలలో బాధితుల శరీరాలు నలుపు రంగులోకి మారిపోవడం ప్రత్యేకత.

గతంలో తన కూతురిని ఇలాంటి హత్యలోనే కోల్పోయిన ధృవ, ఈ కేసును వ్యక్తిగతంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభిస్తాడు. సముద్రఖని, బ్రిగిడా సాగా, అజయ్ ధిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతం అందించారు. ఇది సినిమా ఉత్కంఠను పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం