లైగర్ మూవీతో గట్టి దెబ్బ ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత ఖుషి మూవీ తో పర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు తన కెరీర్లో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో “కింగ్డమ్” అనే సినిమాతో వచ్చేస్తున్నాడు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోయాయి.
అందులోనూ ఈ మూవీ నిర్మాత నాగ వంశీ ఒక్కో ఇంటర్వ్యూలో ఎలివేషన్ ఇస్తూ మరింత బజ్ క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అందులో విజయ్ దేవరకొండ లుక్కు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఊర మాస్ అవతార్లో కనిపించి సర్ప్రైజ్ చేశాడు.
షార్ట్ హెయిర్, గడ్డంతో రగ్గడ్ లుక్ లో కనిపించి సినిమాపై అంచనాలు పెంచేసాడు. ఇటీవల ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ ప్రోమోకు వచ్చిన రెస్పాన్స్ తో ఇవాళ ఫుల్ సాంగ్ విడుదల చేశారు. “హృదయం లోపల” అంటూ సాగే ఈ ఫుల్ వీడియో సాంగ్ ఓ రేంజ్ లో ఉంది.
ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుంది. ఈ తొలి సాంగులో వీరిద్దరి జోడి అద్భుతంగా ఉంది. ఈ సాంగ్లో ఇద్దరూ ముద్దులతో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీత్ అందిస్తున్నాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.