Kingdom Ott: లైగర్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన విజయ్ దేవరకొండ ‘కింగ్డం’ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. జులై 30న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు ఇండియాలో రూ. 50 పైగా నెట్ వసూల్లు, ప్రపంచావ్యాప్తంగా రూ. 90 కోట్లకు పైగా గ్రాస్ వసూల్లు సాధించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరినట్లు పోస్టర్లు తెగ వైరల్ అవుతున్నాయి. మేకర్స్ నుంచి మాత్రం రూ. 100 కోట్లకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
థియేటర్స్ లో రన్ క్లోజ్
ప్రస్తుతం ఈ సినిమా ఇంకా కొన్ని థియేటర్స్ లో రన్ అవుతుండగా.. కలెక్షన్లు పూర్తిగా తగ్గిపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 12వ రోజు సోమవారం ఈ సినిమా కేవలం కేవలం 26లక్షల నెట్ మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కింగ్డం థియేట్రికల్ ముగిసినట్టేనని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
కింగ్డమ్ ఓటీటీ
ఇక థియేట్రికల్ అంతంత మాత్రమే ఉండడంతో .. నెల రోజుల్లోపే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 28 లేదా 29 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతుందని సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.






