kingdom trailer: ‘కింగ్డమ్’ ట్రైలర్ గూస్‌బంప్స్.. ఈ సీన్లు సినిమాకే హైలైట్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కింగ్డమ్’. ఈ మూవీ ట్రైలర్ శనివారం (జూలై 26) విడుదలైంది. తిరుపతిలో అత్యంత ఘనంగా జరిగిన ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ ఇంతకు ముందు ఎన్నడూ చూడని లుక్‌లో, గుండుతో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన డైలాగ్ డెలివరీ, నటన, ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలలో పలికించిన హావభావాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని స్పష్టమవుతోంది.

‘కింగ్డమ్’ ఒక అన్నదమ్ముల అనుబంధం, గ్యాంగ్‌స్టర్ డ్రామా కలగలిసిన కథతో వస్తున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేసినట్లు కనిపిస్తోంది. యువ నటుడు సత్యదేవ్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఆయన పాత్ర కూడా సినిమా కథాగమనంలో కీలకం కానుందని అంచనా వేస్తున్నారు.

అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు ప్రాణం పోసింది. సన్నివేశాలకు తగినట్లుగా అనిరుధ్ అందించిన సంగీతం సినిమా అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్తుందని స్పష్టమవుతోంది. ట్రైలర్ ప్రారంభం నుంచే గ్రాండియర్ విజువల్స్, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు కట్టిపడేశాయి. యుద్ధ సన్నివేశాలు, భారీ పోరాటాలు సినిమా స్థాయిని చాటి చెబుతున్నాయి.

ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. సినిమాపై ఏర్పడిన భారీ అంచనాలను అందుకుని విజయ్ దేవరకొండకు ‘కింగ్డమ్’ ఒక పెద్ద విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం విశేషం.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం