kingdom : విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ వాయిదా?.. కొత్త డేట్ ఇదే!

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కింగ్‍డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పవర్‌ఫుల్ స్పై యాక్షన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన బాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‍తో నిర్మిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. మరో హీరో సత్యదేవ్ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌కు ఎక్కడికక్కడే ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఆలస్యమవుతూనే ఉంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. మొదట ఈ మూవీని మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కానీ అప్పుడు రిలీజ్ కాలేదు. ఆ తర్వాత జూలై 4న విడుదల చేస్తామని గత నెలలోనే మూవీ టీమ్ ఖరారు చేసింది.

అయితే ఆ తేదీకి ఈ సినిమా రిలీజ్ కాదని ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కింగ్‍డమ్ సినిమా జూలై 4 నుంచి వాయిదా పడడం ఖాయమని చర్చ సాగుతోంది. ఈ సినిమా రిలీజ్‌ను అదే నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 25కి వాయిదా వేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్టు టాక్ నడుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

ఈసారి ఈ సినిమా వాయిదాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కారణమని తెలుస్తోంది. మ్యూజిక్ పనులు ఇంకా పెండింగ్‍లో ఉన్నాయని సమాచారం. రీరికార్డింగ్ ఇంకా ఆలస్యమవుతుందని.. అందువల్లే వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం