Virgin Boys : ‘వర్జిన్ బాయ్స్’ టీజర్ రిలీజ్.. ఫుల్ రొమాన్స్ & కామెడీ

గీతానంద్, మిత్ర శర్మ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం వర్జిన్ బాయ్స్. దయానంద దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్ పై రాజా దర్పనేని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీహన్, జెన్నిఫర్, సుజిత్ కుమార్, రోనిత్, అన్షుల, అభిలాషలు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫుల్ కామెడీ అండ్ రొమాంటిక్ చిత్రంగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లో యూత్ ఫుల్ వైబ్స్, కలర్ఫుల్ విజువల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ అలరిస్తుంది. హాస్యం, ఎమోషన్స్, రొమాన్స్ తో కూడిన ఈ స్టోరీ ప్రస్తుత కాలంలో రిలేషన్ షిప్ ను చూపిస్తూ తన స్టైల్ లో అలరిస్తుంది.

ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ క్యారెక్టర్ బాగుంది. అతడి కామెడీ టైమింగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ టీజర్ లో డైలాగ్స్, కామెడీ సీన్స్ ను ఎలివేట్ చేస్తూ బాగా చూపించారు. దీంతో ఈ సమ్మర్ లో వర్జిన్ బాయ్స్ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.

దీనిపై నిర్మాత రాజా మాట్లాడుతూ.. సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా తీర్చి దిద్దామన్నారు. గతంలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయని.. అయితే వాటిని మించి ఈ సినిమా ఉంటుందని ఆయన తెలిపారు. చూడాలి మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం