మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం “విశ్వంభర”. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం చివరి షెడ్యూల్‌లో ఒక భారీ మాస్ డాన్స్ సాంగ్‌ను చిత్రీకరించడంతో షూటింగ్ ముగిసింది. ఈ పాటలో చిరంజీవితో పాటు బాలీవుడ్ నటి మౌనీ రాయ్ సందడి చేసింది. చివరిగా చిరంజీవి, మౌనీ రాయ్ లపై చిత్రీకరించిన మాస్ సాంగ్ అదిరిపోయినట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయికగా.. ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌ను సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. శ్యామ్ కాసర్ల సాహిత్యం అందించగా.. పుష్ప, పుష్ప 2 చిత్రాలలోని బ్లాక్ బస్టర్ పాటలకు కొరియోగ్రఫీ చేసిన గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలో 100 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొన్నారు.
వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీని, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షించారు. “విశ్వంభర” ఒక విజువల్ వండర్‌గా రూపొందుతుందని, భారీ సెట్‌లు, అత్యాధునిక VFX తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది.
షూటింగ్ పూర్తవడంతో చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాలను త్వరలో ప్రారంభించి, విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రం సంక్రాంతి 2025న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మాస్ సాంగ్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని, మెగాస్టార్ చిరంజీవి తన మార్క్ డ్యాన్స్ తో అభిమానులను అలరించడం ఖాయమని తెలుస్తోంది.






