యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వార్ 2’ టీజర్ విడుదలైంది. అందులో అద్భుతమైన, యాక్షన్ సన్నివేశాలను చూసి సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. హృతిక్ రోషన్ నటించిన వార్ రెండవ భాగంలో అతడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌ను ఢీ కొట్టబోతున్నాడు. ఇందులో ఈ ఇద్దరి మద్య సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించాయి. మంగళవారం జూనియర్ ఎన్టీఆర్ 42వ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ ను చిత్రబృందం స్పెషల్ గా రిలీజ్ చేసింది.
ఈ టీజర్ జూనియర్ ఎన్టీఆర్ చేసే భారీ డైలాగ్‌తో ప్రారంభమైంది. అందోలో అతను చాలా కాలంగా కబీర్ (హృతిక్)ని చూస్తున్నానని చెబుతాడు. మొదటి సీన్ నుండే అతనికి కబీర్ పై పాత ద్వేషం ఉందని, దాని కారణంగా అతను ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడని స్పష్టమవుతుంది. అతను ఎలాగైనా కబీర్‌ను ఓడించాలని అనుకుంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో టీజర్‌ను షేర్ చేస్తూ హృతిక్ – ఫైర్ డబుల్ అని రాశారు.
1 నిమిషం 34 సెకన్ల టీజర్లో హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ నిప్పు, నీరు, మంచులో పోరాడుతున్నట్లు చూపించారు. ఇద్దరు నటులు ఒకరినొకరు ఆధిపత్యం చెలాయిస్తున్న లుక్ చాలా బలంగా ఉంది. ఇద్దరూ తమ శైలితో అభిమానుల హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉన్నట్లు అతడి రూపాన్ని బట్టి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక హృతిక్ ఎప్పుడూ ఫిట్‌నెస్‌గానే ఉంటాడు. కియారా ఈ చిత్రానికి గ్లామర్ డోస్ పెంచింది. బికినీలో కనిపించి కుర్రాళ్ల మనస్సు దోచుకుంది. వయ్యారపు నడుము, కిల్లింగ్ లుక్స్ అందాలతో అదరగొట్టేసింది.
హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సాన్ ఖాన్, స్నేహితురాలు సబా ఆజాద్ కూడా టీజర్ పై స్పందించి ‘ఫైర్’ అని కామెంట్ చేశారు. హృతిక్-జూనియర్ ఎన్టీఆర్ జంట చూడదగ్గదని సుజానే చెప్పింది. యాక్షన్ సన్నివేశాలతో బాగా ఆకట్టుకుందని.. ఆ సినిమా చూడటానికి తనకున్న ఆసక్తిని రెట్టింపు చేసిందని సబా తెలిపారు. ఈ టీజర్ కు సెలబ్రిటీల స్నేహితులు, అభిమానుల నుండి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. యూట్యూబ్‌లో కూడా, టీజర్ అనతికాలంలోనే మిలియన్ల వ్యూస్ మార్కును దాటింది. హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య పోరాటం జనాలకు బాగా నచ్చింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్2 ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది.