beauty tips in telugu: అబ్బో అదిరిపోయింది.. ఇలా చేశారంటే అందం రెట్టింపు అవ్వడం ఖాయం!

అందంగా ఉండాలని అందరికి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తాను అందంగా మిల మిల మెరిసిపోవాలని అనుకుంటారు. దీని కోసం డబ్బులు ఖర్చు చేసి రకరకాల బ్యూటీ ప్రొడెక్ట్స్ కొనుక్కుని డబ్బులు వేస్ట్ చేస్తుంటారు. మరికొందరు బ్యూటీ పార్లర్లకు వెళ్లి బాగా ఖర్చు చేస్తారు. అయితే అలా చేయడం వల్ల ఇది కొంతకాలం మాత్రమే ముఖానికి మెరుపును ఇస్తుంది. కానీ సహజ సౌందర్యాన్ని ఇవ్వదు. అలాంటి పరిస్థితిలో నేచురల్ బ్యూటీనెస్‌ను కోరుకుంటుంటే.. మీరు వంటగదిలో ఉన్న వస్తువులతో అలా తయారు అవ్వొచ్చు. వంటిగదిలో ఉన్న వస్తువులతో సహజ సౌందర్యాన్ని పొందడమే కాకుండా డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. కాబట్టి వంటగదిలో ఉండే ఆ వస్తువుల గురించి తెలుసుకుందాం.

పసుపు

పసుపును శతాబ్దాలుగా ముఖానికి ఉపయోగిస్తున్నారు. ఇది ముఖంలోని ముడతలను తొలగించి.. ముఖానికి సహజమైన మెరుపును తెస్తుంది. మీరు దీన్ని పెరుగు లేదా పాలతో కలిపి ముఖానికి మాస్క్ లాగా అప్లై చేసుకోవచ్చు.

తేనె

తేనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీన్ని ఫేస్ మాస్క్ లాగా అప్లై చేసి ముఖం మీద 10 నిమిషాలు అలాగే ఉంచండి. దీని వాడకం వల్ల ముఖం మచ్చలు లేకుండా, మృదువుగా ఉంటుంది.

దోసకాయ

దోసకాయలో 95% నీరు ఉంటుంది. అలాగే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖం మీద వాపును తగ్గిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దోసకాయ ముక్కలను మీ కళ్ళపై ఉంచి కొంతసేపు అలాగే ఉంచండి. కావాలంటే.. దానిని ఫేస్ మాస్క్‌లో కలిపి అప్లై చేసుకోవచ్చు.

పెరుగు

పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది సహజమైన ఎక్స్‌ఫోలియెంట్‌గా పనిచేస్తుంది. మీరు దీన్ని తేనె లేదా పసుపుతో కలిపి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు.

నిమ్మకాయ

నిమ్మకాయలో విటమిన్ సి లభిస్తుంది. ఇది చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది. నిమ్మరసాన్ని తేనెతో కలిపి లేదా ఫేస్ ప్యాక్‌లో వేసుకోవచ్చు. నిమ్మకాయను నేరుగా మీ ముఖం మీద పూయకండి.

తరవాత కథనం