onions health benefits: ఏంటి భయ్యా నిజమా.. ఉల్లి చేసే మేలు తెలిస్తే అస్సలు వదలరు..!

onions health benefits

వేసవి కాలంలో చాలా మంది వడదెబ్బ బారిన పడతారు. అధిక ఉష్ణోగ్రతలకు గురికావడం వల్ల డీహైడ్రేషన్‌కు గురై ఇలా జరుగుతూ ఉంటుంది. దీని వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్లో పడతారు. అయితే వడదెబ్బను నివారించడంలో కొన్ని చిట్కాలు పాటిస్తే ప్రయోజనాలు పొందవచ్చు. అందులో ఉల్లిపాయలు ముఖ్యంగా తినాలి. వేసవి కాలంలో ఉల్లిపాయలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వేసవిలో వీటిని తినడం వల్ల హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు. ఉల్లిపాయలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయి.

ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ – ఉల్లిపాయలో సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. అందువల్ల వేసవి కాలంలో చెమట పట్టడం వల్ల సోడియం, పొటాషియం ఖనిజాలు కోల్పోతాయి. అలాంటి సమయంలో ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల శరీరంలో వాటిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. హీట్ స్ట్రోక్ కు ప్రధాన కారణమైన డీహైడ్రేషన్ ను నివారించడానికి ఇది బాగ ఉపయోగపడుతుంది.

చలువ లక్షణాలు –  ఉల్లిపాయలు శరీరాన్ని చల్లబరుస్తాయి. వేసవిలో పచ్చి ఉల్లిపాయలు.. ముఖ్యంగా ఎర్ర ఉల్లిపాయలు తినడం వల్ల శరీర అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలోని సహజ సమ్మేళనాలు వేడిని తగ్గించే ఆవిరిని విడుదల చేస్తాయి. ఇవి శరీర అంతర్గత ఉష్ణోగ్రతను చల్లబరుస్తాయి. అధిక వేడి, వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు –  ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక వేడి వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి నుండి శరీరాన్ని రక్షిస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గిస్తాయి. కణాలు వేడి నష్టం నుండి కోలుకోవడానికి సహాయపడతాయి.

గుండె ఆరోగ్యం –  తీవ్రమైన వేడిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి గుండె కష్టపడి పనిచేస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది-  వేడి జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఉల్లిపాయల్లో ప్రీబయోటిక్ ఫైబర్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ శరీరం పోషకాలను గ్రహించడానికి, బలంగా ఉండటానికి సహాయపడుతుంది. వేడి సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలను తగ్గిస్తుంది.

తరవాత కథనం