Health Tips: అమ్మాయిలకు మేలైన అస్త్రం.. ఇలా చేస్తే ముఖంపై వెంట్రుకలు మటుమాయం!

చాలా మంది స్త్రీలు తమ ముఖాలపై వెంట్రుకలు ఉండటాన్ని ఇష్టపడరు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. బయటకు రావడానికి కూడా ఇష్టపెట్టుకోరు. దీనికోసం కొంతమంది మహిళలు వ్యాక్స్ చేయించుకుంటారు. ముఖ వెంట్రుకలను తొలగించడానికి రేజర్‌ను ఉపయోగిస్తారు. చాలా మంది మహిళలు ముఖంపై వెంట్రుకలను తొలగించడానికి ఖరీదైన చికిత్సలను కూడా తీసుకుంటారు.

కానీ ఈ చికిత్సలు చర్మంపై కొంతకాలం మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయి. అలాంటి పరిస్థితిలో ముఖ వెంట్రుకలను తొలగించడానికి శనగపిండి మీకు బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించి ముఖ వెంట్రుకలను సులభంగా తొలగించవచ్చు. అలాగే ఇది చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది.

శనగపిండి, తేనె

ముఖ వెంట్రుకలను తొలగించడానికి శనగపిండి, తేనెను ఉపయోగించవచ్చు. ఈ రెండు మిక్స్ చేసి పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి కొంత సమయం అలాగే ఉంచాలి. అది ఆరిన తర్వాత తడి టవల్‌తో జుట్టు పెరుగుదలకు వ్యతిరేక దిశలో ఈ పేస్ట్‌ను తొలగించాలి. ఆ తర్వాత, ముఖాన్ని నీటితో కడగాలి. ఇలా వారానికి 2 నుండి 3 సార్లు చేయాలి. దీని ద్వారా రోమాలు క్రమంగా మాయమవుతాయి.

శనగపిండి, రోజ్ వాటర్

ముఖ వెంట్రుకలను వదిలించుకోవడానికి శనగపిండి, రోజ్ వాటర్‌ను ఉపయోగించవచ్చు. ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి ఆరనివ్వాలి. ఇలా 20 నిమిషాల తర్వాత పేస్ట్‌ను రుద్దాలి. ఆపై మీ ముఖాన్ని నీటితో కడగాలి. వారానికి 2-3 సార్లు ఉపయోగించడం ద్వారా ముఖ వెంట్రుకలను వదిలించుకోవచ్చు.

శనగపిండి, పెరుగు

శనగపిండి, పెరుగు మిశ్రమం ముఖ వెంట్రుకలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రెండింటిని మిక్స్ చేసి పేస్ట్‌ను ముఖంపై కొంతసేపు అప్లై చేయాలి. దాదాపు 20 నిమిషాల తర్వాత ఈ పేస్ట్‌ను చేతులతో తేలికగా రుద్దాలి. తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. వారానికి 2-3 సార్లు ఉపయోగించడం ద్వారా ముఖంపై ఉన్న వెంట్రుకలను వదిలించుకోవచ్చు.

తరవాత కథనం