Guava: జామపండును తక్కువ అంచనా వేయకండి! ఆరోగ్య రహస్యాలు తెలిస్తే షాక్ !

Guava : జామకాయ కేవలం ఒక పండు మాత్రమే కాదు.. ఇదొక పోషకాల పుట్ట అని అంటున్నారు నిపుణులు. ప్రతి రోజు 100 గ్రాముల జామ పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. మళ్ళీ ఈ మోతాదుకు మించి తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. జామకాయ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

పోషకాలు పుష్కలం

జామ పండ్లలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పోషకాహార లోపాలను నివారించడానికి తోడ్పడతాయి.

రోగనిరోధక శక్తి

జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, అంటువ్యాధులు, ఇతర వ్యాధుల రాకుండా రక్షిస్తుంది.

చర్మ సౌందర్యం

జామలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని సూర్యరశ్మి నుంచి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. ఇది వృద్ధాప్య సంకేతాలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా ఉంచుతుంది.

గ్యాస్, అజీర్ణం

జామకాయలోని ఫైబర్ అజీర్ణ సమస్యలను తగ్గించి.. గ్యాస్, అజీర్ణం మరియు ఉబ్బరం వంటి వాటి నుంచి తగ్గిస్తుంది.

జీర్ణక్రియ

జామ పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

షుగర్ నియంత్రణ

డయాబెటిస్ ఉన్నవారికి జామ పండ్లు చాలా మంచివి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ విలువలు తక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

గుండె ఆరోగ్యం

జామ పండులోని పొటాషియం, పీచు పదార్థాలు రక్తపోటును నియంత్రిస్తాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే గుండెపోటు ప్రమాదాలను కూడా తగ్గిస్తాయి.

నోటి

జామ పండ్లు దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఇది నోటిలో ఉన్న బ్యాక్టీరియాను తొలగించి.. నోరు దుర్వాసనను రాకుండా చేస్తుంది.

కంటి చూపు

లోపల గులాబీ రంగులో ఉండే జామ పండ్లలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం