Hair Tips: జుట్టు జిడ్డుగా, చిక్కులతో ఉంటుందా?.. ఈ చిన్న టిప్స్‌తో వాటికి చెక్ పెట్టేయండి!

చాలామందికి జుట్టు అనేది ఒక సమస్యగా ఉంటుంది. జుట్టు మృదువుగా ఉన్నంతవరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కొందరిలో జుట్టు అధికంగా చిక్కులు పడి ఊడిపోతూ ఉంటుంది. జుట్టు జిడ్డుగా ఉంటే త్వరగా చిక్కులు పడుతుంటాయి. అలాంటి సమయంలో జుట్టు దువ్వేటప్పుడు రాలిపోతూ ఉంటుంది. దానిని త్వరగా పరిష్కరించుకోవడం ఉత్తమమైన మార్గం.

జుట్టును స్మూత్ గా మార్చుకోవడానికి షాంపూలు, లీవ్ ఇన్ కండిషనర్లు వాడాల్సి ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు జుట్టును పూర్తిగా వదిలేయకూడదు. మృదువైన జుట్టు కోసం మంచి షాంపూను వాడాలి. అందులో సల్ఫేట్ లేకుండా చూసుకోవాలి. అలాగే మాయిశ్చరైజింగ్, కండిషన్ అప్పుడప్పుడు అప్లై చేయాలి. దీనివల్ల జుట్టు స్మూత్ గా ఉంటుంది.

లీవ్ ఇన్ కండిషనర్

తడిగా ఉన్నప్పుడు జుట్టుకు లీవ్ ఇన్ కండిషనర్ అప్లై చేయాలి. ఇది తేమను జుట్టులోనే స్టోర్ చేసి ఉంచుతుంది. అదే సమయంలో జుట్టు చిక్కులు కాకుండా కాపాడుతుంది. అలాగే జుట్టుకు హైడ్రేటింగ్ గా హెయిర్ మాస్కులు వారానికి రెండుసార్లు వాడాలి. హెయిర్ మాస్కులు వాడడం వల్ల జుట్టు స్మూత్ గా ఉంటుంది.

రెగ్యులర్ గా ట్రిమ్

చాలాసార్లు జుట్టు ఎండిపోయినట్లు, జుట్టు చివర్లు విరిగిపోయినట్లు కనిపిస్తాయి. అలాంటి సమయంలో ట్రిమ్ చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల జుట్టు మరింత ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే తడి జుట్టు ఆరడానికి హెయిర్ డ్రయర్లు వాడకూడదు. వాడితే జుట్టు దెబ్బతింటుంది.

అతిగా జుట్టు దువ్వకూడదు

చాలామంది జుట్టును పదే పదే దువ్వుతూ ఉంటారు. అలా చేయడం మంచి పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల జుట్టు పగుళ్లు, చీలుకలు ఏర్పడతాయి. అలాగే వెడల్పు దంతాలతో ఉండే దువ్వెనతో జుట్టు దువ్వాలి.

తరవాత కథనం