కొబ్బరి నీళ్ళు శరీరానికి చాలా మంచిది. కొబ్బరి నీళ్లలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేయడానికి, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలో కేలరీల కంటెంట్ చాలా తక్కువ. అదనంగా.. పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్ల స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం.. కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడతాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్ల ప్రయోజనాలు
హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి
కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ జర్నల్ అధ్యయనం ప్రకారం.. కొబ్బరి నీరు వ్యాయామం తర్వాత శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంలో స్పోర్ట్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే సహజ చక్కెర, ఖనిజాలు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. శక్తి స్థాయిలను పెంచుతాయి.
రక్తపోటు తగ్గుతుంది
రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య నయమవుతుంది. కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. దీని కారణంగా ఇది గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
మూత్రపిండాల్లో రాళ్లు కంట్రోల్
మూత్రపిండాల్లో రాళ్లను కంట్రోల్ చేయడానికి వైద్యులు పుష్కలంగా నీరు తాగమని చెబుతారు. కొంచెం కొబ్బరి నీళ్ళు కూడా తాగాలి. ఇది మూత్రవిసర్జన ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. రాళ్ళు ఏర్పడే ఖనిజాల సాంద్రతను తగ్గిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో, తొలగించడంలో ఇది సహాయపడుతుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
కొబ్బరి నీళ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తినే ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే ఎంజైమ్‌లు కూడా ఇందులో ఉంటాయి. ఇది కడుపు వ్యాధులను దూరంగా ఉంచుతుంది.
కొబ్బరి నీరు హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల ముడతలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు మీ చర్మాన్ని దెబ్బతినకుండా రక్షించడంలో కూడా సహాయపడతాయి. ఇందులో చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు సి, ఇ కూడా ఉన్నాయి.