సిట్రస్ పండ్లు తాజాదనంతో పాటు అద్భుతమైన టేస్ట్‌ని కలిగి ఉంటాయి. ఇవి ఒకటి కాదు.. అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇందులో విటమిన్ సి వంటి మంచి మూలం ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఈ పండు ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడుతుంది.
అంతేకాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయితే ఈ పండ్లను తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే పుల్లని పండ్లతో కొన్ని ఆహారాల్ని తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. అవేంటో తెలుసుకుందాం.
తీపి స్నాక్స్
మితిమీరిన తీపి స్నాక్స్‌తో సిట్రస్ పండ్లను తింటే అనారోగ్య బారిన పడే అవకాశం ఉంటుంది. సిట్రస్ పండ్లలో ఉండే ఆమ్లత్వం చక్కెర శోషణను పెంచుతుంది. ఈ కారణంగా చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. అదే సమయంలో శక్తి లేకపోవడం, జీర్ణక్రియ, మధుమేహం సంబంధిత సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది.
పుచ్చకాయలు
పుచ్చకాయతో పుల్లని పండ్లను తింటే శరీరంలో అనేక సమస్యలు పెరుగుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది. సిట్రస్ పండ్లలో ఉండే ఆమ్లత్వం కూడా పుచ్చకాయ తీపిని తగ్గిస్తుంది. దీనివల్ల అసౌకర్యం, ఇతర కడుపు సమస్యలను కలిగిస్తుంది.
ఉప్పగా ఉండే ఆహారాలు
ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఉప్పు, కొవ్వు పదార్ధాలతో సిట్రస్ పండ్లను కలపడం హానికరం. కొవ్వు పదార్ధాలు కడుపుకు హాని కలిగిస్తాయి. ఇవి సిట్రస్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లను తొలగిస్తాయి. ఈ కలయిక వేడి, ఆమ్లతను కూడా పెంచుతుంది. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.